తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, సాయంత్రం రెండు పూటల పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షకు 240 మందికి 231 మంది, సాయంత్రం జరిగిన పరీక్షకు 240 మందికి గానూ 230 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంబాబు, పరీక్ష కేంద్రం కోఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు.
భీమవరంలో..
భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పట్టణంలో ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టులలో జరిగిన ఈ పరీక్షకు 300 మందికిగాను 287 మంది విద్యార్థులు హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికిగాను 216 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 194 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికిగాను ఆరుగురు గైర్హాజరయ్యారు.


