బాధితులకు చికిత్సపై ఆరా | - | Sakshi
Sakshi News home page

బాధితులకు చికిత్సపై ఆరా

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

బాధితులకు చికిత్సపై ఆరా

భీమవరం (ప్రకాశంచౌక్‌): గణపవరం మండలం ఎస్‌.కొండేపాడులో బుధవారం బజ్జీలు తిన్న రెండు కుటుంబాలకు చెందిన 11 మంది అస్వస్థతకు గురవడంతో భీమవరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని కలెక్టర్‌ సీహెచ్‌.నాగరాణి, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ జి.గీతాభాయి పరామర్శించి ఆసుపత్రి వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన 11 మందిలో తణుకు జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు, భీమవరం ఆసుపత్రిలో ఐదుగురు, వర్మ ఆసుపత్రిలో ఒకరు, ఇంపీరియల్‌ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారని అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. పాయిజన్‌ కేసు బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement