గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదంటి ఆడ్డబిడ్డ పెళ్లికి రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థికంగా సాయం అందించి ఆదుకున్నారు. అప్పట్లో మూడు నెలలకోసారి కల్యాణమస్తు, షాదీతోఫా పథకం అమలు చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డ వివాహానికి సాయం బదులు అప్పు ఇచ్చే వ్యాపార పథకం అమలు చేయడం సిగ్గుచేటు. రుణం ఇచ్చి వడ్డీతో సాయం చెల్లించాలనడం దారుణం. ప్రభుత్వం అరకొర పథకాలు ఇస్తూ సూపర్‌సిక్స్ ను అటకెక్కించింది. పేదలను ఆదుకునేలా పథకాలు ఇవ్వాలి. పెళ్లికానుకను ఉచితంగా అందించాలి.
– గూడూరి ఉమాబాల, వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి


