పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యం

మాజీ మంత్రి కారుమూరి

తణుకు అర్బన్‌: జగన్‌ 2.0లో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొండంత అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కా ర్యాలయంలో శుక్రవారం 34 వార్డుల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కోసం ఐడీ కార్డు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే నేరుగా వస్తుందన్నారు. ప్రతి కార్యకర్త వివరాలు జగన్‌ పరిశీలనలోనే ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణమే ముఖ్య లక్ష్యంగా పార్టీ కార్యకర్తలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలో వార్డు నాయకులు, పార్టీ వివిధ కమిటీల నాయకులు పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించాలని కోరారు. భవిష్యత్తులో కార్యకర్తలకు మంచి ప్రయోజనాలు ఉంటాయని, దేశవ్యాప్తంగా కార్యకర్తలకు అండగా నిలబడింది వైఎస్సార్‌సీపీ ఒక్కటేననే గుర్తింపు వస్తుందని కారుమూరి అన్నారు.

తణుకులో బలమైన నాయకత్వం

తణుకులో వైఎస్సార్‌సీపీకి బలమైన నాయకత్వం ఉందని నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు అన్నారు. అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఇక్కడ క్యాడర్‌ ధైర్యంగా ఉందని, ఇందుకు మాజీ మంత్రి కారుమూరి కారణమన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు రానున్నాయని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. కూ టమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేసే క్రమంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలోనే ఇక్కడ అధికంగా జరిగిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నియోజకవర్గ మహిళాధ్యక్షురా లు మెహర్‌ అన్సారీ, డాక్టర్‌ దాట్ల సుందరరామరాజు, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు కొత్తపల్లి చ రణ్‌, పట్టణ యూత్‌ అధ్యక్షుడు కలిశెట్టి ప్రకాష్‌, ని యోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్‌, ఎస్సీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement