తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీ గేటు ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. డిపో కమిటీ నాయకుడు సీహెచ్ రమణ మాట్లాడుతూ పీఆర్సీ నియమించాలని, తాత్కాలిక భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహణ ఆర్టీసీ యాజమాన్యం ద్వారానే జరగాలని, ఈ బస్సుల నెపంతో వివిధ డిపోలను ఖాళీ చేసే చర్యలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి అమలు సందర్భంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. హెల్త్ స్కీమ్ ద్వారా సరైన సేవలు అందించాలని కోరారు. 39 డిమాండ్లకు యాజమాన్యం స్పందించాలని నినదించారు. డిపో నాయకులు ఏవీ మనోహర్, ప్రచా ర కార్యదర్శి కె..శ్రీనివాస్, ప్రకాష్, ఎన్‌ఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు.


