జిల్లా డీఈవో నారాయణ
గణపవరం: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, అర్హులైన ఉపాధ్యాయులు, ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని పశ్చిమగోదావరి జిల్లా డీఈవో నారాయణ అన్నారు. సోమవారం గణపవరం మండలం పిప్పరలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా అంగీకరింప చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జె.వెంకటేశ్వర్లు, ఎంఈవో–1 ప్రకాష్, విద్యా కమిటీ ఛైర్మన్ బాలాజీ, బుచ్చిమాస్టారు తదితరులు పాల్గొన్నారు.


