16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు నిర్ణీత గడువులోపు రుణాలు మంజూరు చేయాలి కేంద్రం అసమర్థత వల్లే నీట్‌ పేపర్‌ లీక్‌ భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు ఎట్టకేలకు ఉపాధి పనుల ప్రారంభం

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్‌ అధ్వర్యంలో ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 51వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు–2026 అందిస్తున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ్‌ రాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ తెలిపారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్ర మహేశ్వరీ, శ్రీ శక్తీపీఠాదిశ్వరి (తిరుపతి) మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి ఉమ, రచయిత్రి పారిశ్రామికవేత్త మోహన ఇందుకూరి తదితరులకు ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలను అందిస్తున్నామన్నారు. అలాగే మున్సిపల్‌ మహిళా పారిశుద్ధ్య కార్మికులు 65 మందికి అభినందన సత్కారాలు చేస్తున్నామని తెలిపారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా సమగ్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో భాగంగా పారిశ్రామిక, విద్య, గృహ నిర్మాణ, స్వయం ఉపాధి రంగాలకు సంబంధించిన రుణాలను నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి బ్యాంకు అధికారులకు సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిని జిల్లా కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఎ.నాగేంద్ర ప్రసాద్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ హెడ్‌ వీరభద్రరావు, ఆర్‌బీఐ ఏజీఎం సీజీ కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: నీట్‌ పేపర్‌ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమంటూ మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్‌ మాట్లాడుతూ 720 మార్కులకు గానూ దాదాపు 600 మార్కుల ప్రశ్నలు లీక్‌ అయ్యాయంటే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో? తెలుస్తుందన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలకు కేంద్రప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ, సహాయ కార్యదర్శి బి.సింధు, కె.రోహిత్‌, పి.సాయికృష్ణ పాల్గొన్నారు.

భీమవరం: వాకింగ్‌కు వెళ్లిన తన భార్య తిరిగిరాలేదని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్‌ ఎస్సై రహమాన్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం పట్టణంలోని చెట్టుకింద సాయిబాబా గుడి ప్రాంతంలో గొట్టుముక్కల లక్ష్మీపతిరాజు తన భార్య గోవిందమ్మతో కలసి జీవిస్తున్నారు. ఈ నెల 8న గోవిందమ్మ డీఎన్నార్‌ కళాశాల ఆవరణలోనికి వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో లక్ష్మీపతిరాజు పోలీసులను ఆశ్రయించాడు.

భీమడోలు: ఉపాధి హామీ ఏదీ? అంటూ ఈనెల 10న సాక్షిలో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. కూలీలకు పనులు కల్పించకుండా నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు మెమో జారీ చేసినట్లు భీమడోలు ఎంపీడీఓ సీహెచ్‌ పద్మావతిదేవి మంగళవారం రాత్రి తెలిపారు. అలాగే ఎట్టకేలకు గుండుగొలనులో ఉపాధి హామీ పనులను మొదలు పెట్టించారు. పంచాయతీ పరిఽధిలోని రంగన్న చెర్వు నుంచి కొరుకల్లు వైపు ఉన్న మైనర్‌ ఇరిగేషన్‌ డ్రైయిన్‌ను మంగళవారం ఉపాధి హామీ కార్మికులు 100 మంది పూడిక తీశారు. భీమడోలు ఏపీఓ నాగరాజు పర్యవేక్షణలో పనులు చేపట్టారు. అయితే గ్రామంలో సుమారు వెయ్యికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారని, వారికి కూడా పనులు కల్పించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement