గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

భీమడోలు : ఈదురుగాలులు

ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఏలూరు, భీమడోలు, కామవరపుకోట, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

–సాక్షి నెట్‌వర్క్‌

Advertisement
 
Advertisement
Advertisement