భీమడోలు: ఫ్రభుత్వ పాఠశాలల్లో బడిఈడు పిల్లలందరిని చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని కాకినాడు రీజనల్ జాయింట్ డైరెక్టర్(ఆర్‌జేడీ) జి.నాగమణి అన్నారు. మెగా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా గురువారం భీమడోలులో ఆమె పర్యటించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. భీమడోలు నెం.1, నెం.4 పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రవేశ పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్ జరిగేలా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. కనీసం ఆదర్శ పాఠశాలల్లో 70 మంది విద్యార్థులుండేలా టీచర్ల సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎంఈవో 1, 2 ఈదుపల్లి శ్రీనివాసరావు, అయినపర్తి భాస్కర్‌కుమార్, క్లస్టర్ హెచ్‌ఎం జీఎస్ పద్మజ పాల్గొన్నారు.


