ఉపాధి కూలీల ఆకలి కేకలు
ఉపాధి హమీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు సక్రమంగా వేతనాలు అందడం లేదు. జిల్లాలో రూ.2 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. 8లో u
కామవరపుకోట: ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా తడికలపూడి పోలీసులు పట్టుకుని వారి నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చే సుకున్నారు. ఎస్సై వల్లీ పద్మ తెలిపిన వివరాల ప్ర కారం.. గంజాయి సరఫరా జరుగుతోందని ముందస్తు సమాచారం మేరకు కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రోడ్డులో తనిఖీలు చేపట్టామన్నారు. నారప్పగుంట, జగనన్న కాల నీ సమీపంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారన్నారు. వారిని అదుపులో తీసుకుని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. దీంతో తహసీల్దార్ ఎలీషా, వీఆర్వో బాబురావు ఆధ్వర్యంలో వారిని విచారించగా నిందితులు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన పామర్తి రా జు రంపచోడవరం, అరకు ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి కామవరపుకోట మేరీల బజారుకు చెందిన వానరాసి మౌళి ద్వారా కామవరపుకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 2 సెల్‌ఫోన్లు, రూ. 900, 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వల్లీ పద్మ చెప్పారు.


