భీమవరం: ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమీక్షా సమావేశంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచించారు. ముందుగా రోడ్డు ప్రమాదాల వివరాలు, ప్రమాదాలకు కా రణమవుతున్న అంశాలు, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, ట్రాఫిక్ నియమాల అమలు అంశాలపై చర్చించారు. జాతీయ, రాష్ట్ర రహ దారులుపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. హెచ్చరిక బో ర్డులు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నా రు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ గీతాబాయి, ఆర్డీఓలు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: పట్టణంలోని నాలుగు కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షకు 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికి 214 మంది, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 300 మందికి 291 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 194, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 192 మంది హాజరయ్యారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఒక నెలలో ఒక ని యోజకవర్గం నాలుగు వారాలు పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని జిల్లాలో తొలిసారిగా ఈనెల 15న ఆచంటలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆచంట బాలంవారిపాలెం పీ4 భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఆచంట, పోడూరు, పెను గొండ, పెనుమంట్ర మండలాలకు చెందిన ప్రజలు అర్జీలు సమర్పించవచ్చన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గృహ గణన కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ఆర్డీఓలు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు గృహగణన నమోదు 40 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డీపీఎంలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఉండి: ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లాను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. ఆయన స్థానంలో భీమవరం టూటౌన్‌లో పనిచేస్తున్న మల్లికార్జునరావును ఉండి ఎస్సైగా నియమించారు. అయితే నసీరుల్లాను ఏ కారణంతో వీఆర్‌కు పంపించారో తెలియాల్సి ఉంది.
ఏలూరు (టూటౌన్)/ఉంగుటూరు: ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.రాజ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. 27న బాదంపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఎంపికై న వారి పేర్లు అదే రోజు ప్రకటిస్తారన్నారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 5వ తరగతి ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9573337484, 7286993033, 9492337649 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ద్వారకాతిరుమల: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి, లక్షలాది రూపాయ లు తీసుకుని మోసగించిన మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోట మండలం రామన్నపాలేనికి చెందిన ఆడమిల్లి హర్షవర్ధిని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాన ని నమ్మించి దొరసానిపాడుకు చెందిన కర్రి బా లాజీ నుంచి రూ.2,75,000 తీసుకుని మోసగించింది. దీంతో బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుపై గతనెల 19న కేసు నమోదైంది. భీమడోలు సీఐ పి.కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన ద్వారకాతిరు మల ఎస్సై సుధీర్ ఆడమిల్లిలోని ఆమె ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. భీమడోలు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై చెప్పారు.


