భీమవరం: కేంద్ర ప్రభుత్వం విజయ గర్వంతో కార్మికులపై దాడిని ప్రారంభించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్ ధ్వజమెత్తారు. భీమవరంలో లేబర్ కోడ్స్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీఐటీయూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్స్ అమలు కోసం రూల్స్‌ను రూపొందించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. లేబర్ కోడ్స్ కారణంగా శ్రామికవర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, పరిశ్రమల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు శూన్యమన్నారు. వేతనాలు పడిపోయి ధరలు విపరీతంగా పెరిగి ఉపాధి తగ్గి వలసలు మరింత పెరిగి దేశంలో అశాంతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు, సోమేశ్వరరావు, భూపతి సత్యనారాయణ, ఎం.శివ పాల్గొన్నారు.
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ జూనియర్ బా లికలు, బాలుర చాంపియన్‌షిప్ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమగోదావరి, బాలుర వి భాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచా యి. గెలుపొందిన జట్లకు చాంపియన్ ట్రోఫీని బహూకరించారు.
కొయ్యలగూడెం : ఆపదలో ఉన్న బాలుడి ప్రాణాలను నిలబెట్టడానికి గ్రామ యు వత నడుం బిగించింది. ఇంటింటా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురించిన ‘సాయం కోసం ఎదురుచూపులు’ కథనానికి స్పందించడంతో పాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బయ్యనగూడెంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సింగంశెట్టి నాగమణికంఠ పరిస్థితి తెలుసుకున్న యువకులు తొలిరోజు రూ.1.50 లక్షలు విరాళాలు సేకరించి అందజేశారు. బాలుడి వైద్యానికి రూ.22 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇకపై రోజూ సమీప గ్రామాల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తామని యువకులు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం డబుల్ బుల్డోజర్ సర్కార్‌గా మారి ప్రజలపై భారాలు వేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. దీనిపై జూన్, జూలై నెలల్లో ప్రజాపోరుకు సిద్ధమయ్యామన్నారు. స్థానిక ఉద్దరాజు రామం భవనంలో సీపీఎం జిల్లాస్థాయి విస్తృత సమావేశం ఆదివారం జిల్లా కార్యదర్శివర్గ స భ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన ని ర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని, నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్నారు. సర్ అనే పేరుతో ప్రజల ఓటు హక్కును సైతం భ్రష్టుపట్టించారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆకివీడు, కడపలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, బి.బలరాం మాట్లాడుతూ ఆక్వా, మొక్కజొన్న రైతులు నష్టాల్లో ఉన్నారన్నారు.


