జంగారెడ్డిగూడెం : గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం సందర్భంగా ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,81,683 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1779 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు.
నూజివీడు: గతంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడి కేసుల్లో బుక్ అయిన నిందితులకు లోక్‌అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య శనివారం పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడిన నిందితులతో సమావేశం నిర్వహించిన ఎకై ్సజ్ సీఐ మాట్లాడుతూ తమపై ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు. పట్టుబడిన మద్యం సీసాల విలువకు మూడు రెట్లు జరిమానాను ప్రభుత్వ ఖజానాకు చలానా రూపంలో చెల్లిస్తే అక్రమ మద్యం విక్రయదారులపై ఉన్న కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని నిందితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తణుకు అర్బన్: తణుకు ఆర్టీసీ డిపోలో రోజూవారీ వేతనంతో అవుట్‌సోర్సింగ్ విధానంలో డ్రైవర్స్‌ను తీసుకుంటున్నట్లు డిపో మేనేజరు ఏడీఎల్ సుధారాణి తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెనన్స్ వచ్చి 18 నెలలు పూర్తికావాలని, గతంలో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడలేదని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌తో ధ్రువపత్రం, ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని డిపోలో హాజరుకావాలని సూచించారు. రికార్డు పరిశీలన అనంతరం మెడికల్ పరీక్షలు చేయించి ట్రైనింగ్‌లో సెలెక్ట్ అయినవారిని తీసుకుంటామని చెప్పారు. దరఖాస్తులను డిపో అసిస్టెంట్ మేనేజరు కార్యాలయంలో అందచేయాలని, ఇతర వివరాలకు 7382903287, 7382908959 నంబర్లలో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.


