దెందులూరు: మండలంలోని రామారావుగూడెంలో పాత గొడవల నేపథ్యంలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థి దాసరి భరత్‌కుమార్‌ను కోడి కత్తితో తీవ్రంగా గాయపరిచారని దెందులూరు ఎస్సై రాచమల్లు శివాజీ తెలిపారు. వివరాల ప్రకారం దాసరి భరత్ కుమార్ వంగాయగూడెంలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో రామారావుగూడెం గ్రామంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఫ్లెక్సీ కట్టే విషయంలో గొడవ జరిగడంతో, ఆ కక్షతో ఆదివారం రాత్రి రామారావుగూడెం గ్రామం ఎన్టీఆర్ బొమ్మ ఖాళీ స్థలం వద్ద కూర్చుని ఉన్న భరత్‌కుమార్‌పై నేతల శ్యామ్ అనే వ్యక్తి ఒక్కసారిగా కోడి కత్తితో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన దాసరి భరత్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా ఐసీయూ చికిత్స పొందుతున్నాడు. బాధితుడు నేతల శ్యామ్, దవులూరి ఫణీంద్ర, కొడుదుల సతీష్, నంబూరి గుణ పృథ్వీలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
కలిదిండి(కై కలూరు): కుటుంబ కలహాలు, మానసిక సమస్యలతో మద్వానిగూడెం వద్ద ఉప్పుటేరు వంతెనపై నుంచి ఓ వ్యక్తి సోమవారం రాత్రి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన కె.సత్యసాయి కుమార్ (35)కు వివాహం కాగా భార్య, కుమార్తె ఉన్నారు. ఇంటి వద్ద స్వల్ప వివాదం జరగడంతో క్షణాకావేశంలో చనిపోవాలని నిర్ణయం తీసుకుని వంతెనపై నుంచి దూకాడు. దీంతో అతడి బంధువులు కలిదిండి ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ విషయాన్ని తెలపగా ఆయన కై కలూరు అగ్నిమాపక అధికారులకు తెలిపారు. కై కలూరు నుంచి ఫైర్ ఆఫీసర్ కె.క్రాంతికుమార్ సిబ్బంది వచ్చి మంగళవారం ఉదయం నుంచి గాలించారు. ఎట్టకేలకు ఉప్పుటేరు వంతెన నుంచి కొంత దూరంలో గుర్రపుడెక్క కింద భాగంలో సత్యసాయి కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు.


