ఆర్జీయూకేటీని అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీని అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతా

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

ఆర్జీయూకేటీని అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతా

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) వైస్‌ చాన్సలర్‌గా ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ఆచార్య కొత్తా మధుమూర్తి సమక్షంలో ఆయన చార్జ్‌ తీసుకున్నారు. 1988లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ డిగ్రీ, 1990లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి ఎంఫిల్‌ డిగ్రీని, 1996లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి డాక్టరేట్‌ డిగ్రీని పొందిన ఆచార్య మద్దాలి ఐఐటీ కాన్పూర్‌లోని కెమిస్ట్రీ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. శాసీ్త్రయ పరిశోధన, బోధనతో పాటు విద్యా పరిపాలన రంగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పలు పరిశోధనా పత్రాలు ప్రచురించి విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీని అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement