పూర్తి ఉచితంగా ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పూర్తి ఉచితంగా ఇవ్వాలి

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

పూర్తి ఉచితంగా ఇవ్వాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడబిడ్డల వివాహాలకు గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థికసాయం అందించారు. ఇది పేదలకు ఎంతో ఉపయోగపడింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లవుతున్నా పెళ్లిళ్లకు సంబంధించి ఎలాంటి సాయం అందించలేదు. ఇప్పుడు రూ.లక్ష అప్పు ఇస్తాం.. వడ్డీతో సహాయ తిరిగి చెల్లించాలంటూ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామంటున్నారు. ఇది ఎంత వరకు సబబు. ఆడ్డబిడ్డ పెళ్లి కి అప్పు కాకుండా ఉచితంగా ఆర్థిక సాయం అందించాలి. అలాగే గత ప్రభుత్వంలో మాదిరిగా బాలింతగా ఉన్నప్పుడే రూ.5 వేలు సాయం అందించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది.

– పాలవెల్లి మంగ, భీమవరం

Advertisement
 
Advertisement
Advertisement