వీరవాసరం: ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించకపోతే ఆందోళనలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంత రొయ్యల రైతుల సంక్షేమ సంఘం తీర్మానం చేసింది. ఆదివారం వీరవాసరం తులసి ఫంక్షన్ హాల్‌లో ఐదు నియోజకవర్గాల రొయ్యల రైతుల సంక్షేమ సంఘ గ్రామస్థా యి, జిల్లాస్థాయి కమిటీల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రొయ్య రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లినా అండగా ఉండటామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫీడ్ కంపెనీలు, రొ య్యల రైతుల నాయకులు, ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక సమీక్ష సమావేశాలు సానుకూలంగానే ఉండటం ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఆక్వా ఫీడ్ యజమానులు చేస్తున్న ప్రభుత్వ లాబీయింగ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గుతాయేమో అన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేశా రు. భీమవరం ప్రాంత జిల్లా అధ్యక్షుడు మల్ల తులసీరామ్, కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు, బాపిరాజు, వీరవల్లి చంద్రశేఖర్, ఎం.వెంకట్రావు, పెద్దెత్తున రొయ్య రైతులు పాల్గొన్నారు.


