ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫెన్సింగ్‌ సెలెక్షన్స్‌ నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

భీమవరం: స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష లు ప్రశాంతంగా జరిగాయి. 150 మంది వి ద్యార్థులకు 149 మంది హాజరయ్యారని సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌ పీఆర్‌ఎస్‌ వెంకటపతిరాజు తెలిపారు. అలాగే విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో 120 మందికి 117 మంది, డీఎన్నార్‌ కళాశాలలో 160 మందికి 159 మంది హాజరయ్యారు.

తాడేపల్లిగూడెంలో..

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 208 మందికి 208 మంది హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ రాంబాబు, కేంద్రం కో–ఆర్డినేటర్‌ నటరాజ్‌ తదితరులు పర్యవేక్షించారు. అలాగే శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో 150 మందికి 148 మంది, ఏపీ నిట్‌లో 200 మందికి 197 మంది హాజరయ్యారు.

తణుకు అర్బన్‌: జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు 24 మంది క్రీడాకారులు ఎంపికై నట్టు ఏపీ ఫెన్సింగ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జీఎస్‌ వీ కృష్ణమోహన్‌ తెలిపారు. ఏపీ స్టేట్‌ క్యాడెట్‌ బాయ్స్‌ అండ్‌ గరల్స్‌ (అండర్‌ 17) ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2026–27, 21వ నేషనల్‌ క్యాడెట్‌ ఫెన్సింగ్‌ ఏపీ స్టేట్‌ టీమ్‌ సెలెక్షన్స్‌ స్థానిక ఆకుల శ్రీరాముల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు హా జరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ క్యాడెట్‌ ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల అధినేత ఆకుల విష్ణువర్థన్‌, ఏపీ ప్రైవేట్‌ ఐటీఐ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు బసవ రామకృష్ణ పోటీలను ప్రారంభించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే డి విజన్‌, మండల కేంద్రాల్లోనూ ఈ కార్య క్రమం నిర్వహిస్తామని, ప్రజలు అర్జీలు సమర్పించవచ్చన్నారు. అలాగే అర్జీలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చని, 1100 కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement