●ప్రమాదకరంగా వంతెన | - | Sakshi
Sakshi News home page

●ప్రమాదకరంగా వంతెన

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

●ప్రమాదకరంగా వంతెన

ఏలూరు సమీపంలో ఉన్న తమ్మిలేరుపై వంతెన ప్రమాదకరంగా మారింది. రెయిలింగ్‌ పూర్తిగా ధ్వంసమై, ఫుట్‌పాత్‌ గోతులు పడి అధ్వానంగా తయారైనా పట్టించుకునే వారు లేరు. రక్షణగా ఉండాల్సిన రేలింగ్‌ లేకపోవడంతో ఏదైనా వాహనం అదుపు తప్పితే తమ్మిలేరులో పడిపోయే పరిస్థితి ఉంది. చివరకు నడిచి వెళ్లే వారికి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇడా ఆధీనంలో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మొక్కలు కూడా నీరు లేక ఎండిపోయి, కేవలం కుండీలు మాత్రమే మిగిలాయి. విశేషమేమిటంటే నగర మేయర్‌ ప్రతిరోజూ ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులోని మార్కెట్‌ యార్డు సమీపంలో ఉన్న వంతెన దుస్థితి ఇది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, ఏలూరు

Advertisement
 
Advertisement
Advertisement