మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

మహిళ మృతి

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

మహిళ మృతి కొలిక్కిరాని ఆక్వా ఫీడ్‌ ధరల సమస్య

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి హైవేపై చోటుచేసుకుంది. 8లో u

పాలకొల్లు సెంట్రల్‌: ఆక్వా రైతులకు సంకటంగా మారిన ఫీడ్‌ ధరల సమస్య పరిష్కారానికి చర్చలు కొలిక్కిరాలేదని మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నారని జై భారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అన్నారు. శనివారం పూలపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీడ్‌ కంపెనీలతో శుక్రవారం జరిపిన చర్చలకు మంత్రి అచ్చెన్నాయుడు రాకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఫీడ్‌ ధరలు పెంచాల్సిందేనని కంపెనీల ప్రతినిధులు అంటే.. కుదరదని రైతులు పట్టుబట్టారన్నారు. రైతులతో చర్చలు పూర్తయితేనే పెంచిన ఫీడ్‌ ధరలు అమలులోకి వస్తాయని చెప్పారు. ఎక్కడైనా ధరలు పెంచి విక్రయిస్తే ఆక్వా సంఘం సభ్యులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. అలాగే ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ల యజమానులతో మూడుసార్లు చర్చలు జరగ్గా కొంత వరకూ సానుకూలత వ్యక్తం చేశారన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే తుది కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, సజ్జా బుజ్జి, భూపతిరాజు శ్రీనివాసరాజు, అంగర వరప్రసాద్‌, గుంటూరి చంటిరాజు, మేడిది జాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement