ఇంజనీర్‌ తేజకు రైల్వే నుంచి ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

ఇంజనీర్‌ తేజకు రైల్వే నుంచి ప్రశంసలు

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

ఇంజనీర్‌ తేజకు రైల్వే నుంచి ప్రశంసలు

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): నగరానికి చెందిన సోమ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఇంజనీర్‌ సూరత్తు తేజ రైల్వే అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఇటీవల ఏలూరులోని పెద్ద రైల్వే స్టేషన్‌లో రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్‌ ముఖ ద్వారాన్ని ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా, జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన రాజగోపురం మాదిరిగా డిజైన్‌ చేసి ఆకర్షణీయంగా మలచడంలో సూరత్తు తేజ చేసిన కృషి అభినందనీయమని పేర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ బి.నాగేశ్వరరావు తేజకు ప్రశంసాపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement