ఏలూరు టౌన్: ఏలూరు నిమ్మకాయల యార్డ్ ప్రాంగణంలో గోడ పక్కగా ఒక మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఒక మృతదేహాన్ని నిమ్మకాయల యార్డులో పనిచేసే వారు గుర్తించారు. వెంటనే ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్‌టౌన్ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉంది. సుమారుగా వారం రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహంపై లేత ఆకుపచ్చ రంగు పుల్‌హ్యాండ్స్ చొక్కా, నలుపురంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందనీ... ఎవరికై నా తెలిస్తే తమను సంప్రదించాలని ఏలూరు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.


