ప్రశాంతంగా ఈఏపీసెట్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఈఏపీసెట్‌ పరీక్ష

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

ప్రశాంతంగా ఈఏపీసెట్‌ పరీక్ష వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగ కార్యదర్శిగా అప్పారావు అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి ప్రభుత్వ బడుల్లో 5,965 మంది చేరిక

భీమవరం: భీమవరం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 150 మందికి 143 మంది విద్యార్దులు హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 150 మందికి 144 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు షిప్ట్స్‌లో 220 మంది విద్యార్థులకు 211 మంది, డీఎన్నార్‌ అటానమస్‌ కళాశాల సెంటర్‌లో 200 మందికి 194, ఇంజనీరింగ్‌ కళాశాల సెంటర్‌లో 200 మందికి 193 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏలూరు జిల్లాలో 787 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలు శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 787 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో మధ్యాహ్నం షిప్ట్‌నకు 120 మందికి గాను 116 మంది హాజరు కాగా ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 170 మందికి 163 మంది, మధ్యాహ్నం 170 మందికి 161 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 180 మందికి 176 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 171 మంది హాజరయ్యారు.

వీరవాసరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగ కార్యదర్శిగా వీరవాసరానికి చెందిన మద్దాల అప్పారావును నియమించినట్లు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా మద్దాల అప్పారావు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగ కార్యదర్శిగా నియమించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పెనుగొండ: ఆచంట బాలంవారిపాలెంలోని పీ4 భవనంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి 238 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శశ్రద్ధ చూపాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలతో వచ్చే సమావేశానికి హజరు కావాలని సూచించారు. ఆచంట మండలం నుంచి 129, పెనుమంట్ర మండలం నుంచి 28, పోడూరు మండలం నుంచి 17, పెనుగొండ మండలం నుంచి 64 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీవో దాసిరాజు, డ్వామా పీడీ డాక్టర్‌ సీహెచ్‌ అప్పారావు, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 5,965 మంది బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించామని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు తెలిపారు. బడి పిలుస్తోంది, ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ పై కలెక్టర్లతో విద్యా శాఖ కార్యదర్శి శనివారం జూమ్‌ కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కోన శశిధర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలలో ప్రీ స్కూల్‌లో ఉన్న పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, బడి మానివేసిన వారిని తిరిగి బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీలలో ప్రీ స్కూల్‌ చదువుతున్న వారిలో 11,200 మంది పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు లక్ష్యం కాగా, ఇంతవరకు 5,965 మందిని బడులలో చేర్పించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ప్రభుత్వ బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement