గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి శోభారాణి తెలిపారు. మండలంలోని మారుమూల గామమైన దొరమామిడిలో ఆమె శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీని సందర్శించారు. అక్కడ వైద్యం పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆసుపత్రిల్లో ప చేస్తున్న వైద్యులు అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే వారికి సకాలంలో వైద్యం అందేలా కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే అదే గ్రామంలో ఆర్‌ఎంపీ ఆసుపత్రి రూమ్‌, మెడికల్‌ షాపును సీజ్‌ చేశారు. ఇటివల కోర్సవారిగూడెం గ్రామానికి చెందిన ఒక చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో ఆర్‌ఎంపీ షాపును సీజ్‌ చేశామని చెప్పారు. అయితే ఆర్‌ఎంపీ వ్యవహారంపై తెలుసుకునేందేకు వెళ్లిన డీఎంహెచ్‌వోకు గ్రామస్తులు అడ్డపడ్డారు. మాజీ సర్పంచ్‌ తెల్లం రాముడు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎందుకు ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకుటున్నారు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహరంలో ఆర్‌ఎంపీకి గ్రామస్తులు అండగా నిలబడ్డారు. అతనికి నాయ్యం చేయకపోతే ఏలూరు జిల్లా కార్యాలయానికి వచ్చి అందోళనలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జె.సురేష్‌, డాక్టర్‌ నందిని, డీఎంఓ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement