కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సాలిపేటకు చెందిన వావిలాల శ్రీనివాసులు యూకేలో తన సామాజిక సేవలకు గుర్తింపుగా బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక కింగ్ గార్డెన్ పార్టీకి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. గత 20 ఏళ్లుగా యుకేలో ఉంటున్న ఆయన భారతీయ, స్థానిక సమాజాల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని, బ్రిటిష్ రాజ కుటుంబం నుంచి వ్యక్తిగత ఆహ్వానం అందుకోవడం చాలా అరుదైన విషయం ఆనందం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు పెరుగుతున్న ఈ కాలంలో, మన సంస్కృతిని గౌరవిస్తూ సమాజానికి సేవ చేయడం ఎంతో ముఖ్యమని తాను నమ్ముతున్నానని తెలిపారు.


