జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్‌కుమార్, డీఈఓ
సీజ్ చేయాలి
కోచింగ్ సెంటర్‌లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వసతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్‌ఎఫ్‌ఐ
జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్
అడ్డగోలుగా ఫీజులు..
ఉమ్మడి జిల్లాలో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు, హాస్టర్లు నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అధికారులు జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు.–మారుతి, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్‌యూ,
మహబూబ్‌నగర్
●


