పెరిగిన పెట్రోల్, డీజిల్, విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు కలిగేలా ప్రభుత్వం కనీస మద్దతు ధరలు పెంచాలి. పెట్టుబడులు పెరుగుతున్న రీతిలో మద్దతు ధరలు పెరగకపోవడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. ప్రభుత్వ చెల్లించే మద్దతు ధరలతో రైతులకు ఆశించిన లాభాలు అందడం లేదు.
– మోనపురం మహేశ్, రైతు, కాన్‌కుర్తి
ఎరువుల ధరలు నియంత్రించాలి
రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలను కంపెనీలు ఏటా పెంచుతూనే ఉన్నాయి. వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు, మందులు, ఎరువులపై దృష్టి సారించాలి. పెట్టుబడులు భారీగా పెరుగుతున్నా.. మద్దతు ధరలు మాత్రం నామమాత్రంగా పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకోంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిపై బోనస్ ఇవ్వడం లేదు.
– అంజిలయ్యగౌడ్, జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం, నారాయణపేట
వచ్చే సీజన్‌కు మద్దతు ధరలు..
కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధరలు వచ్చే వానాకాలం పంటలకు వర్తిస్తాయి. రైతులకు అండగా నిలిచేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు ఎంతో లాభసాటిగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులకు మరింత లాభం చేకూరుతుంది.
– జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి
●


