నారాయణపేట: ఎస్పీ డా. వినీత్ వనపర్తి ఇన్‌చార్జ్ ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్య తలు చేపట్టిన రాజేష్ మీనా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.
కానిస్టేబుల్ కుమార్తెకు అభినందనలు..
ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ రాఘవేందర్ కుమార్తె నవ్య ఇంటర్మీడియట్‌లో 991 మార్కులు సాధించింది. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా. వినీత్‌ను విద్యార్థిని మర్యాదపూర్వకంగా కలవగా ఎస్పీ ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నవ్య కృషి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదగాలని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే కానిస్టేబుల్ రాఘవేందర్‌ని ప్రత్యేకంగా అభినందిస్తూ కుమార్తె ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం పిల్లల విజయానికి ముఖ్యమని తెలిపారు. ఈ విజయం పోలీసుశాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి ఏఎస్పీ రాజేష్ మీనా, కానిస్టేబుల్ రాఘవేందర్ ఉన్నారు.


