విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

నారాయణపేట రూరల్‌: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం బాలకేంద్రంలో నిర్వహించిన కళా వైభవం ఆర్ట్‌ కల్చరల్‌ డే కార్యమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కృషి, పట్టుదల, ఓర్పు, లక్ష్యంతో దేనినైనా సాధించవచ్చని, కష్టంగా కాకుండా ఇష్టంతో అనుకున్న పనిని సులభంగా పూర్తి చేయవచ్చని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సంస్కృతి, సాంప్రదాయ కళలు దోహదపడతాయని, చిన్నారులు వేసవి సెలవులు వృథా చేయకుండా బాలకేంద్రంలో తమకు నచ్చిన కళలు నేర్చుకోవాలని కోరారు. అంతకుముందు నృత్యం, పాటలు, డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారులు రాజేంద్రకుమార్‌, విద్యాసాగర్‌, నాగార్జున్రెడ్డి, యాదయ్యశెట్టి, బాలకేంద్రం సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి, సిబ్బంది వసంత్‌కుమార్‌, సంగ నర్సింహులు, జ్ఞానమృత, శ్రీకాంత్‌, సాయినాథ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement