ప్రైవేట్‌దే జోరు..! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌దే జోరు..!

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

చివరి గింజ వరకు

కొనుగోలు చేస్తాం..

కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి రైతుల అనాసక్తి

తేమశాతం, తాలు అంటూ జాప్యం

అకాల వర్షాలతో

ఆందోళనలో అన్నదాతలు

ప్రైవేట్‌లో విక్రయించేందుకు

ఆసక్తి చూపుతున్న వైనం

నారాయణపేట: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్‌యార్డుకు ధాన్యపు రాశుల కళ వచ్చింది. యా సంగి కోతలు ఊపందుకోవడంతో రైతులతో కళకళాడుతుంది. జిల్లాలో ప్రభుత్వం 161 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రైవేట్‌ వ్యా పారం జోరుగా సాగుతుంది. మంచిధరలు వచ్చేలా మార్కెట్‌లో వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు.

● ఓ వైపు అకాల వర్షాలు.. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక ఎక్కడ తడిసిపోతుందోననే భయంతో రైతులు నేరుగా జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు తరలిస్తున్నారు. ఇటు తెలంగాణ.. అటు కర్ణాటక సరిహద్దులోని పలు గ్రామాల నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రెండ్రోజులుగా మార్కెట్‌యార్డుకు ధాన్యం పోటెత్తింది. వ్యాపారులు సైతం తేమ శాతం 17 ఉంటే క్వింటాకు రూ.2,440 వరకు చెల్లిస్తుండటంతో రైతులు ప్రైవేట్‌లో విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు.

జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రతి కేంద్రం పరిధిలో చివరి గింజ వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేశాం. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులు, గోదాంలకు తరలించేందుకు తగిన చర్యలు చేపట్టాం.

– సైదులు,

డీఎం, పౌరసరఫరాలసంస్థ

Advertisement
 
Advertisement
Advertisement