ప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్‌లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్‌నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్


