దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

కందనూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగు లకు 44 వాహనాలు, డిగ్రీ విద్యా ర్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లు అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్‌ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఉపకరణాలను అందజేస్తుందని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement