మాగనూర్: నిరుపేదలు సొంత ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే పట్టుకుని కేసులు నమోదు చేసే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సెలవు దినాల్లో పెద్ద పెద్ద యంత్రాలతో వాగులను లూటీ చేస్తున్న పెద్దలు కనిపించడం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం మాగనూర్ సమీపంలోని పెద్దవాగులో ఓ కంపెనీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా..ఆయన వాగు వద్ద కు చేరుకొని నిరసన వ్యక్తంచేశారు. అనంతరం ఆ యన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ విషయంపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో సంప్రదించగా.. ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పినట్లు తెలిపారు. అయితే సెలవు దినా ల్లో ఇసుకను అక్రమంగా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇసుక తవ్వేందుకు వాగులోకి తీసుకొచ్చిన యంత్రాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేయాలని.. లేనిచో మండల ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మారెప్ప, అవిడప్ప, అశోక్‌గౌడ్, గజపతి, బాబు, వెంకటేశ్, నవీన్ పాల్గొన్నారు.


