నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పెసర క్వింటా సరాసరి ధర రూ.7,616 పలికింది. అలాగే వరి సోనారకం గరిష్టంగా రూ.2,374, కనిష్టంగా రూ.1,555 ధర లభించింది.
వేరుశనగ క్వింటా రూ.7,552
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,552, కనిష్టంగా రూ.4,589 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,259, కనిష్టంగా రూ.6,199, జొన్నలు గరిష్టంగా రూ. 5,777, కనిష్టంగా రూ.5,010, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,992, కనిష్టంగా రూ.5,762, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,559, కనిష్టంగా రూ. 1,605, రాగులు గరిష్టంగా రూ.2,777, కనిష్టంగా రూ.2,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,867, కనిష్టంగా రూ.1,600, మినుములు రూ.7,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,001, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ. 1,701గా ధరలు నమోదయ్యాయి.


