● ఆయకట్టులో తుది దశకు చేరుకున్న
వరి పంటలు
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో యాసంగి వరి పంటలు తుది దశకు చేరుకోవడంతో కాల్వలకు మరో రెండ్రోజులు మాత్రమే సాగునీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంలో మూడురోజుల పాటు సాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ప్రాజెక్టులో 1.461 టీఎంసీల నీరు ఉండటంతో వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పీజేపీ నందిమళ్ల డివిజన్ డీఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. నీటి అవసరం ఉందని ఒకరిద్దరు రైతులు అడుగుతున్నారని.. రెండురోజుల్లో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు.


