ఊట్కూర్: సనాతన ధర్మానికి దేవాలయాలే పునాదులని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిత్య పరాశ్రీ అన్నారు. శనివారం బిజ్వార్‌లో ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ, ద్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన ఆలయాన్ని అభివృద్ధి పర్చడం సంతోషకరమన్నారు. పిల్లల్లో చిన్నప్పటి నుండే సంస్కృతిక సాంప్రదాయాల పట్ల అవగాహన కలిపించాల్సిన బాద్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన అన్నారు. ఆలయాలకు వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత అలవడుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, బిజేపి రాష్ట్ర నాయకులు కొండయ్య, భక్తులు చాకలి వెంకటప్ప, కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, హనిమిరెడ్డి, ఆంజనేయులుగౌడ్, భూపాల్‌రెడ్డి, రామలింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


