ఏళ్లుగా అడవిని నమ్ము కుని బతుకుతున్నాం. ఇ ప్పుడు ఖాళీ చేయాలంటున్నారు. ప్రభుత్వం త రపున పరిహారం ఇస్తా మని చెబుతున్నారు. కానీ ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి.
– పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్
పరిహారం ఇస్తేనే వెళ్తాం..
అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి.
– మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట
బలవంతం లేదు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం.
– రేవంత్‌చంద్ర, ఐఎఫ్‌ఎస్ అధికారి, డీఎఫ్‌ఓ


