ఓటరు మ్యాపింగ్‌కు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ఓటరు మ్యాపింగ్‌కు సహకరించండి

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

నారాయణపేట: పట్టణంలో 90 శాతానికి పైగా ఓటరు మ్యాపింగ్‌ పూర్తయ్యేలా బూత్‌ లెవెల్‌ అధికారులకు కౌన్సిలర్లు, బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ రాజేందర్‌గౌడ్‌ కోరారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పుర పరిధిలోని కౌన్సిలర్లు, బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో ఓటరు నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి సమావేశమయ్యారు. త్వరలో నిర్వహించనున్న ఐఆర్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. పట్టణ పరిధిలోని 40 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు మ్యాపింగ్‌ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. బీఎల్వోలు వేగవంతంగా ఓటరు మ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement