నారాయణపేట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అర్హులందరికీ సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెనన్స్‌లో శనివారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఎన్నికై న 272 మంది సర్పంచులు, 72 మంది మున్సిపల్ కౌన్సిలర్లులో ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలని సూచించారు. జిల్లాలో మార్చి 6 నుంచి ఇప్పటి వరకు 10 అంశాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 2న జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించుకున్నామని, 12న మండల స్థాయిలో, శనివారం రోజు నియోజకవర్గ స్థాయిలో, ఈ నెల 26న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్రస్థాయిలో ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందన్నారు.
160 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు జనగణన కొనసాగుతుందని, ఎమ్యూనరేటర్లకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మెరుగ్గా వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని గొల్లపల్లి శివారులో, నారాయణపేట మండలంలోని లింగంపల్లి వద్ద 20 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలువురు చేనేత కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు నోడల్ అధికారి రాజేందర్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని ప్రజలకు చదివి వినిపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్‌పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్‌రావు, ఆర్టీఓ మేఘా గాంధీ, సీపీఓ ఖాఘవాహన్, మున్సిపల్ కమిషనర్ శంకర్, తహసీల్దార్లు అమరేందర్ కృష్ణ, తిరుపతయ్య, సింధూజ, రాంకోటి తదితర అధికారులు పాల్గొన్నారు.


