నారాయణపేట: జిల్లా కలెక్టర్‌గా సీహెచ్ ప్రియాంక సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, ఏఓ శ్రీధర్, జిల్లా అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
కోస్గి రూరల్: స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గందె ఓంప్రకాశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఎన్నికల అధికారి వెంకటనర్సింహగౌడ్ సోమవారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మల్లికార్జున్, ప్రధానకార్యదర్శిగా రాజలింగం, మహిళా రిప్రజెంటేటివ్‌గా పర్వీన్‌బేగం, స్పోర్ట్స్‌లో తాజ్‌ఖాన్, సంతోష్‌నాయక్, లైబ్రరీ కార్యదర్శులుగా భీమప్ప, మురళి, సభ్యులుగా ప్రభాకర్, వీఎన్ గౌడ్, మల్లేష్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడోసారి తనను ఎన్నుకున్నందుకు ఓంప్రకాశ్ న్యాయవాదులందరికి ధన్యవాదాలు తెలిపారు. కోర్టు భవన నిర్మాణానికి, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని కార్యవర్గం హామీ ఇచ్చింది.
వైద్య కళాశాలకు
మృతదేహం అప్పగింత
ఆత్మకూర్: పట్టణానికి చెందిన విశ్రాంత డీఏఓ రాజశేఖరరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్థులకు మృతదేహం ఉపయోగపడుతుందని, ఇందుకు ముందుకొచ్చిన రాజశేఖర్‌రావు కుటుంబ సభ్యులను ప్రొఫెసర్లు అభినందించారు. అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాజశేఖరరావు సతీమణి నాగమణి, కుమారుడు వెంకటనాంగేంద్రప్రసాద్, కుమార్తెలు విజయ లక్ష్మి, నాగజ్యోతి, బంధువులు పాల్గొన్నారు.


