ప్రజలను మోసం చేయడమే.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేయడమే..

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడమంటే ప్రజలను మోసం చేయడమే. ముందే పెంచితే బీజేపీకి ప్రజలు వ్యతిరేకమవుతారని తర్వాత ధరలు పెంచింది. ఎన్నికల ముందు ఒకటి.. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం బీజేపీకి అలవాటే. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.

– పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్‌

పన్ను తగ్గించాలి..

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్యులపై పెనుభారం పడుతుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ప్రజల ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెట్రోల్‌, డీజీల్‌ ధరల పెంపును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను ఈ సమయంలో తగ్గించాలి. ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్‌ వెంటనే రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై విధించే వ్యాట్‌ను రూ.మూడు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలుగుతుంది.

– ఎస్‌.రాజేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement