మహిళల స్వయం ఉపాధికి కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల స్వయం ఉపాధికి కృషి

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

గ్రామాల అభివృద్ధే లక్ష్యం..

మక్తల్‌: మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం పట్టణంలోని సెట్విన్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. కేంద్రంలో మహిళలు కుట్టు, మగ్గం, కంప్యూటర్‌ తదితర విభాగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద కంపెనీలను తీసుకొచ్చి నేరుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు కేంద్రంలో తయారుచేసిన యూనిఫా మ్స్‌ అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రిని నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్‌ విజయకుమార్‌, శిక్షకుడు తిమ్మప్ప, బీకేఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు లక్ష్మారెడ్డి, కౌన్సిలర్‌ శ్రీవిద్య, కో–ఆప్షన్‌ సభ్యుడు శంషోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితులకు పరిహారం అందించాలి..

పేరపళ్ల, ఊట్కూర్‌ రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ గురువారం రైతులు వెంకట్రామారెడ్డి, జనార్దన్‌రెడ్డి, గోవిందరాజు, బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. మూడురోజుల్లో పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

ఊట్కూర్‌: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశువర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని చిన్నపొర్ల, పెద్దపొర్ల, పగిడిమారిలో వంతెనలు, సీసీ రహదారుల నిర్మాణాలకు భూమిపూజ.. పగిడిమారిలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చింత రవి, ఎంపీడీఓ కార్తీక్‌, సర్పంచులు జాఫర్‌, కాశమ్మ, ప్రశాంత్‌కుమార్‌, నాయకులు యజ్ఞేశ్వర్‌రెడ్డి, కోరం మహేష్‌రెడ్డి, ఘని, విష్ణుమూర్తిగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement