బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీపద్మావతి శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ సర్పంచ్ బత్తిని అమృత్‌రెడ్డి – భార్గవి దంపతుల కై ంకర్యంతో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీపాదస్వామి బృందం కల్యాణతంతు జరిపించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి ఘట్టాలను కనులపండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


