వేసవి శిబిరానికి క్రీడాసామగ్రి అందజేత | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరానికి క్రీడాసామగ్రి అందజేత

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో కొనసాగుతున్న ఉచిత వేసవి క్రికెట్‌ శిబిరానికి హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ అసోసియేషన్లు సంయుక్తంగా రూ.లక్ష విలువైన క్రీడాసామగ్రిని శుక్రవారం అందించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా క్రికెట్‌ అసోషియేషన్‌ కార్యదర్శి రాజశేఖర్‌, అడిషనల్‌ ఎస్పీ రియాజ్‌ ఉల్‌హక్‌ నిర్వాహకులకు సామగ్రి అందజేసి మాట్లాడారు. క్రీడాకారుల కోసం జంబో కిట్‌, నెట్స్‌, బాల్స్‌, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వస్తువులు అందించామని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసవి శిబిరంలో మెళకువలు నేర్చుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి తల్లిదండ్రులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సురేష్‌, ఇన్‌చార్జ్‌ రమణ, కోచ్‌ అజయ్‌, ట్రాఫిక్‌ ఎస్సై కృష్ణ చైతన్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement