విద్యాశాఖ ముందుచూపు | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ ముందుచూపు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

రాత పుస్తకాలు సైతం..

సకాలంలో పాఠ్య పుస్తకాల పంపిణీకి సన్నద్ధం

–8లో u

జిల్లాకేంద్రంలోని సింగార్‌బేస్‌ పాఠశాల గోదాంలో పాఠ్య పుస్తకాలు భద్రపరుస్తున్న ఇన్‌చార్జ్‌

నారాయణపేట రూరల్‌: పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుగుసాగుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో అందజేస్తోంది. గతంలో ఆంగ్ల మాధ్యమ పుస్తకాల కొరత తలెత్తగా.. ఈసారి దాన్నికూడా అధిగమించడానికి కృషి చేస్తున్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి అవసరమైన పుస్తకాల సంఖ్యను ముందుగానే గుర్తించి అందుకు 10 శాతం అధికంగా గత విద్యా సంవత్సరం మధ్యలోనే ముద్రణ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని స్టాక్‌ పాయింట్‌కు సగానికిపైగా పుస్తకాలు చేరాయి.

జిల్లాలో 72,493 మంది విద్యార్థులు..

జిల్లాలో 513 ప్రభుత్వ, 11 కేజీబీవీ, 6 గురుకుల, రెండు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 72,493 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 3,31,340 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే వాటిలో కొన్ని పాత పుస్తకాలు ఉండగా.. ఇప్పటి వరకు 2,85,950 పుస్తకాలను విడతల వారీగా పంపించగా.. వాటిని జిల్లాకేంద్రంలోని సింగార్‌బేస్‌ పాఠశాల గోదాంలో భద్రపర్చారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాకు 86 శాతం పుస్తకాలు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

పంపిణీకి సన్నద్ధం..

జిల్లాలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ మీడియం పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పుస్తకాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 86 శాతం పుస్తకాలు రాగా.. మిగిలిన 14 శాతం పుస్తకాలు వారం రోజుల్లోగా తెప్పించి జూన్‌ 1 వరకు సంబంధిత ఎంఆర్‌సీలు, క్లస్టర్‌ పాయింట్లకు చేరుస్తారు. అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠ్య పుస్తకాలు తీసుకెళ్తారు. గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పుస్తకాల పంపిణీకి అంతా సిద్ధం చేసింది.

ఇప్పటికే 86 శాతం మేర

గోదాంకు చేరిక

అన్ని తరగతుల విద్యార్థులకు

రాత పుస్తకాలు సైతం..

బడుల ప్రారంభం నాటికి విద్యార్థులకు

అందజేస్తామంటున్న అధికారులు

కాగితం ధర అమాంతం పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు వారి పిల్లలకు రాత పుస్తకాలు కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతేడాది నుంచి పాఠ్య పుస్తకాలతో పాటు రాత పుస్తకాలను (నోట్‌బుక్స్‌)ను అందిస్తోంది. ఈ ఏడాది కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటి తయారీ సైతం ప్రారంభమైంది. జూన్‌లో పాఠశాలలు తెరిచే నాటికి సిద్ధం చేసి అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రెండేళ్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వారికి మాత్రమే రాత పుస్తకాలు అందించగా.. గతేడాది నుంచి ప్రాథమిక తరగతులకు సైతం ఇవ్వడం ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement