నారాయణపేట రూరల్: ప్రైవేట్ పాఠశాలలకు దీ టుగా సర్కారు బడుల్లో వసతులు కల్పిస్తున్నామని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తుండటంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన మధ్యా హ్న భోజనంతో పాటు అన్నిరకాల క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానానికి కంప్యూటర్ బోధన అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవడం మానుకోవా లని సూచించారు. అంతకుముందు గ్రామ వీధుల్లో బడిబాట ర్యాలీ నిర్వహించారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో స ర్పంచ్ సంగీత, ఉప సర్పంచ్ లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, యాదయ్య శెట్టి, డీఎస్‌ఓ భానుప్రకాష్, జీహెచ్‌ఎం భారతి, తపస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ, ఏఏసీ చైర్మన్ మణెమ్మ, కాంగ్రెస్ నాయకులు రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


