ఉద్యాన కళాశాల విద్యార్థుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన కళాశాల విద్యార్థుల నిరసన

Apr 28 2026 7:29 AM | Updated on Apr 28 2026 7:29 AM

కొత్తకోట రూరల్‌: పెద్దమందడి మండలంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొ. జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్‌ కోర్సును ప్రారంభించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ఉద్యానవిద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉండగా.. మరో యూనివర్సిటీలో అదే కోర్సు ప్రవేశపెట్టడంతో ఉద్యాన విద్య ప్రత్యేకత దెబ్బతింటుందని, ఈ నిర్ణయంతో అకాడమిక్‌ వ్యవస్థలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement