తల్లీ..వందనం | - | Sakshi
Sakshi News home page

తల్లీ..వందనం

May 10 2026 8:22 AM | Updated on May 10 2026 8:22 AM

మూడు రోజులకోసారి..

త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం

విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత

పోలీస్‌, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు

నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు

మున్సిపాలిటీల్లో తాగునీటి కొరతతో ప్రజల అవస్థలు

రోజు విడిచి రోజు

మిషన్‌ భగీరథ నీటి సరఫరా

పట్టణ శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం

పట్టించుకోని పాలకులు..

కన్నెత్తి చూడని అధికారులు

‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే

స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు

ఉన్నతాధికారులు. ఐఏఎస్‌, ఐపీఎస్‌తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల

బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం

సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని

పలువురు ఉన్నత ఉద్యోగుల

అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు...

– సాక్షి, నాగర్‌కర్నూల్‌/

పాలమూరు/గద్వాల/ జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌)

దయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్‌ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్‌లో కూడా రోజు హోంవర్క్‌ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది.

ఉదయం 6 గంటలకే దినచర్య మొదలు..

మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్‌ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్‌ చూసుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్‌గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.

– డాక్టర్‌ శిరీష, ఆర్‌ఎంఓ జనరల్‌ ఆస్పత్రి

పిల్లలతో ఆర్‌ఎంఓ డాక్టర్‌ శిరీష

పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..

పోలీస్‌ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

– విజయలక్ష్మి, ఏఎస్‌ఐ,

షీ టీం ఇన్‌చార్జి, నాగర్‌కర్నూల్‌

ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర

ఎకై ్సజ్‌ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్‌ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్‌నగర్‌ టౌన్‌ ఎకై ్సజ్‌ ఎస్‌ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్‌, ఏడేళ్ల కొడుకు రోహన్ష్‌ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్‌వేర్‌ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్‌ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు.

కన్నీటి కష్టాలు!

నారాయణపేట: వేసవి వచ్చిందంటే చాలు.. జిల్లా ప్రజలు తాగునీటి కష్టాలతో సతమతం కావాల్సిందే. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రోజు విడిచి రోజు నీరందుతోంది. అది కూడా అరగంట నుంచి ముప్పావుగంట మాత్రమే సరఫరా చేస్తుండటంతో జనానికి ఏమాత్రం సరిపోవడం లేదు. తాగునీటి కష్టాలతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా కేంద్రంలో తప్పని తంటాలు..

దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో జిల్లాకేంద్రమైన నారాయణపేట ఒకటి. పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే చాలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఈ ఏడాది నీటి సమస్యను అధిగమించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా.. ప్రజలు ఫిల్టర్‌ వాటర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. మిషన్‌ భగీరథ పైపులైన్‌ నిర్మాణానికి అమృత్‌ 2.0 వస్తుందంటూ అధికారులు సమాధానం ఇస్తూ దాటవేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ, ప్రతిభ కాలనీ, పళ్ల ఏరి యా, జంగిడిగడ్డ, గాయత్రి నగర్‌, శాసన్‌పల్లి రో డ్డు, మడి ఏరియాలతో పాటు పట్టణ శివారులోని కొత్త కాలనీలో సైతం మిషన్‌ భగీరథ నీటి సరఫరా అంతంతమాత్రమేనని జనం వాపోతున్నారు.

విలీన గ్రామాల్లోనూ..

కోస్గి, మక్తల్‌, మద్దూర్‌ మున్సిపాలిటీల్లోని వీలిన గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కారణంగా బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పేరుకు మాత్రమే మిషన్‌ భగీరథ నీరు వస్తుందని.. అది కూడా రోజు విడిచి రోజు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని జనం వాపోతున్నారు. మక్తల్‌, మద్దూర్‌, కోస్గి పట్టణాల్లో సైతం మిషన్‌ భగీరథ నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది.

మక్తల్‌లో అరగంటే..

మక్తల్‌ మున్సిపాలిటీలో మిషన్‌ భగీరథ నీటిని రెండు, మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తుండగా.. వచ్చేది కూడా అరగంట మాత్రమే. దీంతో తాగునీటి కష్టాలతో సతమతమవుతున్నామని జనం వాపోతున్నారు. పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా.. మిషన్‌ భగీరథ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

మా కాలనీలో మూ డు రోజులకు ఒక సారి మిషన్‌ భగీరథ నీ రు సరఫరా చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా సక్రమంగా చేయాలని కోరుతున్నాం. వేసవిలో నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మంత్రి స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నాం.

– పార్వతమ్మ, మక్తల్‌

Advertisement
 
Advertisement
Advertisement