రైతులపైనే భారం.. | - | Sakshi
Sakshi News home page

రైతులపైనే భారం..

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

ఏటా పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావారణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు తగ్గించేందుకు, ధరలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలి. – రాములు, రైతు, మరికల్‌

ధాన్యం ధరలు పెంచాలి..

ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏదో సాకుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. కాని రైతులు పండించిన పంటకు మాత్రం ధర అడిగే హక్కు లేదా? కంపెనీల జోలికి వెళ్లని ప్రభుత్వం రైతులపై ప్రతాపం చూపి వారు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మి నిలువునా మోసపోతున్నాం. రైతులు పండించిన ధాన్యం ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– మల్లేష్‌, రైతు, పెద్దచింతకుంట

Advertisement
 
Advertisement
Advertisement