ఽనారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–16 జావెలిన్ త్రో విభాగంలో సందీప్ బంగారు, అండర్–20 హైజంప్‌లో జనార్దన్ సిల్వర్, అదేవిధంగా జావెలిన్ త్రోలో రాధిక బంగారు పతకం సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ తెలిపారు. సత్తా చాటిన క్రీడాకారులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారికదేవి, కోచ్ జగదీ ష్, వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
పౌర్ణమికి రెండు పతకాలు..
మిడ్జిల్: హనుమకొండలో ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి మూడో అథ్లెటిక్స్ పోటీల్లో మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి అద్భుత ప్రతిభ చాటి ఓ స్వర్ణపతకంతో పాటు ఓ కాంస్య పతకం సాధించింది. డిస్కస్‌త్రో ఈవెంట్‌లో 29.69 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. అలాగే షాట్‌పుట్ లో 8.49 మీటర్లు విసిరి మూడో స్థానంతో కాంస్య పతకం పొందింది. ఈ సందర్భంగా పౌర్ణ మికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
కొత్త కోర్సుల్లో చేరండి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్‌ఎస్‌ఐ, బీబీఏలో రీటైల్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్‌ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్‌గా ఎంవీఎస్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.


